మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Krishna Bhujanga Prayata Ashtakam – శ్రీ కృష్ణ భుజంగప్రయాతాష్టకం
సదా గోపికామండలే రాజమానం
లసన్నృత్యబంధాదిలీలానిదానమ్ |
గలద్దర్పకందర్పశోభాభిదానం
భజే నందసూనుం సదానందరూపమ్ || 1 ||
వ్రజస్త్రీజనానందసందోహసక్తం
సుధావర్షివంశీనినాదానురక్తమ్ |
త్రిభంగాకృతి స్వీకృతస్వీయభక్తం
భజే నందసూనుం సదానందరూపమ్ || 2 ||
స్ఫురద్రాసలీలావిలాసాతిరమ్యం
పరిత్యక్తగేహాదిదాసైకగమ్యమ్ |
విమానస్థితాశేషదేవాదినమ్యం
భజే నందసూనుం సదానందరూపమ్ || 3 ||
స్వలీలారసానందదుగ్ధోదమగ్నం
ప్రియస్వామినీబాహుకంఠైకలగ్నమ్ |
రసాత్మైకరూపాఽవబోధం త్రిభంగం
భజే నందసూనుం సదానందరూపమ్ || 4 ||
రసామోదసంపాదకం మందహాసం
కృతాభీరనారీవిహారైకరాసమ్ |
ప్రకాశీకృతస్వీయనానావిలాసం
భజే నందసూనుం సదానందరూపమ్ || 5 ||
జితాఽనంగసర్వాంగశోభాభిరామం
క్షపాపూరితస్వామినీవృందకామమ్ |
నిజాధీనతావర్తిరామాతివామం
భజే నందసూనుం సదానందరూపమ్ || 6 ||
స్వసంగీకృతానంతగోపాలబాలం
వృతస్వీయగోపీమనోవృత్తిపాలమ్ |
కృతానంతచౌర్యాదిలీలారసాలం
భజే నందసూనుం సదానందరూపమ్ || 7 ||
ధృతాద్రీశగోవర్ధనాధారహస్తం
పరిత్రాతగోగోపగోపీసమస్తమ్ |
సురాధీశసర్వాదిదేవప్రశస్తం
భజే నందసూనుం సదానందరూపమ్ || 8 ||
ఇతి శ్రీహరిరాయాచార్య విరచితం శ్రీ కృష్ణ భుజంగప్రయాతాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.